కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి నిదర్శనం ఇదే. రాజకీయాల్లో భాగంగా ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలు..ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటే కార్యకర్తల్లో ఆనందం వేరే లెవల్లో ఉంటుంది. అలాంటి సంఘటన ఇప్పుడు ఒకటి జరిగింది. సిరిసిల్ల జిల్లా నర్మాలలో వరద బాధితులను పరామర్శించి వస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుపడ్డారు. కేటీఆర్ కాన్వాయ్ వద్దకు రావడంతో బండి సంజయ్ కారు దిగి అభివాదం చేశారు. బాగున్నారా అంటూ ఇద్దరు పలకరించుకున్నారు. తర్వాత కేటీఆర్ నర్మాల బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు.
బండి సంజయ్ కు ఎదురుపడిన కేటీఆర్..ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


