కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు గోల్ మాల్ పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని మొదట డిమాండ్ చేసింది తామేనని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే తమ డిమాండ్ పై సీఎం రేవంత్ రెండేళ్ల కాలయాపన చేశారని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ విచారణ ఎలా చేస్తుందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.
కమిషన్ రిపోర్టు బీఆర్ఎస్ చేతిలో పెట్టి..సిబిఐతో విచారణా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఘోష్ కమిషన్ రిపోర్టు బీఆర్ఎస్ ఇచ్చి దొంగ చేతికి సీఎం రేవంత్ రెడ్డి తాళాలు అందించారంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిడ్డ కవిత చెప్పిందంటూ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గుర్తు చేశారు.


