epaper
Thursday, March 12, 2026
epaper

బాలల చేతిలో బ్యాలెట్..!

బాలల చేతిలో బ్యాలెట్..!
మాక్ పోలింగ్‌తో విద్యార్థుల్లో ఎన్నికల జోష్
ఓటింగ్ ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన

కాకతీయ, కూసుమంచి : పిల్లలకు ఓటు హక్కు ఎప్పుడొచ్చింది అని అనుకునేలా కూసుమంచి మండల కేంద్రంలో శనివారం మాక్ పోలింగ్ ఆకట్టుకుంది. విద్యార్థుల్లో ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గ్లోబల్ రెయిన్ బో పాఠశాల, *జేవీఆర్ కళాశాల*ల్లో నమూనా ఎన్నికలు నిర్వహించారు. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులంతా ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌, ఓటింగ్ విధానం, కౌంటింగ్ ప్రక్రియలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.

నిజమైన ఎన్నికల మాదిరిగానే…

మాక్ పోలింగ్‌ను పూర్తిగా అసలైన ఎన్నికల తరహాలోనే నిర్వహించారు. ఓటర్ లిస్ట్ ప్రకటించడం, తరగతి–సెక్షన్‌ల వారీగా బ్యాలెట్ పేపర్లు ముద్రించడం, పోలింగ్ ఏజెంట్ల నియామకం, పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారులుగా విద్యార్థులే బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, రెండు రోజుల ప్రచారం అనంతరం గుర్తులు కేటాయించి పోలింగ్ నిర్వహించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ అధికారులుగా విద్యార్థులు విధులు నిర్వర్తించారు. మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించారు.

నాయకత్వ లక్షణాలకు బీజం

ఈ మాక్ పోలింగ్‌లో స్కూల్ లీడర్‌గా సీహెచ్ యశ్వంత్, గర్ల్స్ రిప్రజెంటేటివ్‌గా వై హర్షిత శ్రీ అనురాధ విజయం సాధించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాడెంట్ ఎర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ.. ఓటు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, భవిష్యత్తులో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించడమే మాక్ పోలింగ్ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఇన్‌చార్జీలు పాపారావు, జాహ్నవి, నాజియా, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఆరిఫ్ అలీతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..! దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు ఎకరానికి 25...

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు కాకతీయ, కూసుమంచి:...

చిన్నారులకు పాదరక్షల పంపిణీ

చిన్నారులకు పాదరక్షల పంపిణీ కోయగట్టు అంగన్వాడిలో సేవా కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు చెప్పులు అందజేత కాకతీయ...

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వ గడువుకు ముందే పట్టాల పంపిణీ మంత్రుల చొరవతో వెలుగుమ‌ట్ల‌...

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి కూసుమంచి మండలంలో అమానుష ఘటన ఫోక్సో చట్టం కింద...

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..!

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..! భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు వెలుగుమట్ల భూదాన్...

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

ఇక ఉపేక్షించేది లేదు

ఇక ఉపేక్షించేది లేదు కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియ‌స్‌ పున‌రావృతం కాకుండా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img