epaper
Sunday, March 1, 2026
epaper

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!
దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం
నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టొద్దు.. మెరిట్‌కే అవకాశం ఇవ్వాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కాకతీయ, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తూ బ్యాక్‌డోర్ ద్వారా ఉద్యోగ నియామకాలకు కుట్ర పన్నుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల పేరుతో పరీక్షలు లేకుండా దొడ్డిదారిన నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి పలువురు నిరుద్యోగులు తనను కలిసి ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశారని కవిత తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ వంటి పోస్టులను పైరవీలతో భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం అందిందని చెప్పారు. ఇది నిరుద్యోగ యువతకు తీవ్రమైన అన్యాయం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన యువతకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో కాంగ్రెస్‌కు ఓట్లు వేయించారని, కానీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్‌ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్న యువత ఆశలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కొన్ని చోట్ల అక్రమ నియామకాలు జరిగాయని, నిర్మల్ జిల్లాలో 44 పోస్టులు డబ్బులకు అమ్ముకున్న ఘటన వెలుగులోకి వచ్చిందని గుర్తుచేశారు. అప్పట్లో యువత పోరాటంతో ఆ నియామకాలు ఆగిపోయాయని, కానీ ఇప్పుడు అదే తరహా దందా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ మొదలవుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి అక్రమ నియామకాలను వెంటనే నిలిపివేయాలని, పారదర్శక విధానంలో మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలో జరిగే నియామకాలను పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన నిర్వహించేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. “డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నాలు ఎవరు చేయొద్దు. భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మెరిట్ ఉన్న నిరుద్యోగులకు తెలంగాణ జాగృతి ఎప్పటికీ అండగా నిలుస్తుంది” అని ఆమె స్పష్టం చేశారు.
నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసే దొడ్డిదారి నియామకాలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కవిత హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అవసరం

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అవసరం కాలుష్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img