కాకతీయ, క్రైమ్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని శిశువు డెడ్ బాడీ నీటిలో తేలుతూ కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామ శివారులోని పత్తే సాగర్ చెరువు అలుగు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. డెడ్ బాడీని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందంచారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. శిశువు డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శిశువును ఎవరు వదిలిపెట్టారన్న కోణంలో విచారణ చేపట్టారు.
దారుణం.. చెరువులో తేలిన శిశువు డెడ్ బాడీ..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


