కాకతీయ, హనుమకొండ : హనుమకొండలో టెన్నిస్ క్రీడ అభివృద్ధికి కృషి చేస్తానని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. అజీజ్ ఖాన్ తెలిపారు. జేఎన్ఎస్ స్టేడియంలో హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు టెన్నిస్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టెన్నిస్ కోర్టులో ఫ్లడ్‌లైట్లు, క్లే కోర్టు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విజేతలుగా నాగయ్య–శ్రీధర్ జంట, ద్వితీయ స్థానంలో శివరాజ్–రోహిత్ జంట నిలిచారు. కార్యక్రమంలో ఇవి శ్రీనివాస్, బాబు రెడ్డి, డాక్టర్ నల్ల సురేందర్ రెడ్డి, ప్రొ. ఎర్రగట్టు స్వామి, ఏసీపీ అంబటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


