అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం
కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో దాతల సహకారంతో నిర్మించుకున్న శ్రీహరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి క్షేత్రం కుటీరంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమం శివాలయం ప్రధాన అర్చకులు దేవేంద్రశర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య శాశ్వత దాతలు ఎనగండ్ల జెన్నయ్య – రాములమ్మ దంపతులు,స్థానిక ఎస్సై మాలోత్ సురేష్ – కావ్య దంపతులు,బొల్లంమోహన్ రావు, ఆలయ మాజీ ఛైర్మన్ బొల్లం రమేష్ బాబు,అయ్యప్ప కుటీరం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి,పాలు పొంగించి గృహ ప్రవేశం నిర్వహించారు.అనంతరం పలు పూజలు చేశారు.గృహప్రవేశం కార్యక్రమానికి జూనియర్ అసిస్టెంట్ మార్కశేఖర్ హాజరయ్యారు.ఈకార్యక్రమంలో అయ్యప్ప కుటీరం కమిటీ సభ్యులు మొగులగాని యాదగిరి,ఎరనాగి రమేష్,కల్లెడరమేష్, కల్లెడమధు,మంచాలవేణు,ఎర్ర నర్సయ్య,చెల్లిమెలగణేష్,నకిరేకంటి యాకయ్య,పట్నూరి ప్రేమ్ కుమార్,నయీంపాషా,మంచాల వేణు తదితరులు పాల్గొన్నారు.


