ఏప్రిల్ 1న అయ్యప్ప స్వామి మహాపడిపూజ
* అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు తాటిపెల్లి ఆంజనేయులు గుప్త
కాకతీయ, చేర్యాల:అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 1న చేర్యాల అయ్యప్ప స్వామి ఆలయంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు తాటిపెల్లి ఆంజనేయులు గుప్త తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ. అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవ కార్యక్రమానికి భక్తమహాశయులు సతీ సమేతముగా పెద్ద ఎత్తున రావాలని పేర్కొన్నారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకలతో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని అన్నారు. అనంతరం మహా పడిపూజ కార్యక్రమం ఉంటుందని అన్నారు. పడిపూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదలతో పాటు మహా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు.


