epaper
Tuesday, December 2, 2025
epaper

మందుల వినియోగంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

మందుల వినియోగంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి
దీర్ఘాకాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారికి ఆర్థిక భారం త‌ప్పించాలి
వైద్యుల‌కు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ సూచ‌న‌లు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : దీర్ఘాకాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి ప్ర‌భుత్వం ఉచితంగా అందజేస్తున్న మందుల వినియోగంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌రీంన‌గ‌ర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధికారుల‌కు సూచించారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ అధిక రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేయించి, నిర్ధారణ అయిన వారికి ప్రైవేట్ మందులు కొనాల్సిన అవసరం లేకుండా చూడాల‌న్నారు. మంగ‌ళ‌వారం రోజున పట్టణ ఆరోగ్య కేంద్రం మోతాజ్‌ఖానాలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని పీవో ఎన్సీడీ, పీవో ఎంహెచ్ఎన్ అధికారులతో కలిసి కేంద్రాన్ని సందర్శించి ఆశా కార్యకర్తల పనితీరును వర్గాల వారీగా సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య‌శాఖ అధికారి మాట్ల‌డుతూ నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల గృహ ఆధారిత సంరక్షణ పర్యవేక్షణను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. శిశు సంరక్షణ, పోషకాహారం, ఆరోగ్య సమస్యల గుర్తింపు అంశాల్లో తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ఆరోగ్య మహిళా శిబిరాల్లో మహిళల రీ స్క్రీనింగ్ శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఫాలోఅప్‌పై దృష్టి పెట్టాలన్నారు. తీవ్ర పోషకాహార లోపం, బరువు తక్కువ పిల్లలను గుర్తించి, పోషకాహార పునరావాస జిల్లా కేంద్రానికి తరలించే విషయంలో తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. క్రమంలో ఆర్‌బీఎస్‌కే, 102 వాహనాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఓ ఎన్సిడి డాక్టర్ ఉమాశ్రీ, పిఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సనా జవేరియా, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఇమ్రాన్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆరెపల్లి వాగులో శ్మ‌శాన వాటిక నిర్మాణం వద్దు

ఆరెపల్లి వాగులో శ్మ‌శాన వాటిక నిర్మాణం వద్దు ప్ర‌జాధనం వృథా కాకుండా మ‌రో...

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి కాక‌తీయ‌,...

ఎన్నికల విధుల నుంచి సడలింపు ఇవ్వాలి

ఎన్నికల విధుల నుంచి సడలింపు ఇవ్వాలి తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్...

ఆ శవం ఎవరిది..? ఎవ‌రు హ‌త్య చేశారు

ఆ శవం ఎవరిది..? ఎవ‌రు హ‌త్య చేశారు మిస్ట‌రీగా శంభునిప‌ల్లి గోనె సంచిలో...

మద్యం మానలేక వ్యక్తి ఆత్మహత్య

మద్యం మానలేక వ్యక్తి ఆత్మహత్య కాకతీయ, జగిత్యాల రూరల్: జ‌గిత్యాల‌ మండలంలోని లక్ష్మీపూర్...

కిక్ బాక్సింగ్ పోటీలలో విద్యార్థుల ప్రతిభ

కిక్ బాక్సింగ్ పోటీలలో విద్యార్థుల ప్రతిభ కాకతీయ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లా...

శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలు

శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలు కాకతీయ,...

136 మొబైల్‌ ఫోన్లు రికవరీ

136 మొబైల్‌ ఫోన్లు రికవరీ బాధితులకు అంద‌జేసిన జ‌గిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌ కాకతీయ, జగిత్యాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img