- అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాంకడే
కాకతీయ, హుజురాబాద్ : బేటీ బచావో, బేటీ పడావో పథకంలో భాగంగా హుజురాబాద్ పురపాలక కార్యాలయంలో గర్భస్థ శిశు రక్షణ (పీసీపీఎన్‌డీటీ చట్టం) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, నోడల్ అధికారి బీబీ పథకం డాక్టర్ అశ్విని తానాడే వాకాజీ మాట్లాడుతూ,పీసీపీఎన్‌డీటీ చట్టంపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధం గురించి ప్రజల్లో చైతన్యం పెంచి, గర్భస్థ మరియు ఆండ శిశు మరణాలను తగ్గించేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఆమె సూచించారు.మొదటి బిడ్డగా ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండవ సారి గర్భం దాల్చిన మహిళల్లో ఆడ,మగ పిల్లల మధ్య లింగ భేదం లేకుండా సమాన భావన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ అశ్విని పేర్కొన్నారు. అలాగే డేగ శస్త్రచికిత్సలు (ప్రసవాలు) సకాలంలో జరగేలా వైద్య పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ, పురపాలక కమిషనర్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


