రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన సదస్సు
నెల్లికుదురు/ఇనుగుర్తి: రోడ్డు భద్రత పై ఇటీవల ఎస్పీ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు ఆధ్వర్యంలో నెల్లికుదురు,ఇనుగుర్తి మండలాల తో పాటు కేసముద్రం సర్కిల్ పరిధి లోని గ్రానైట్ క్వారీ, క్రషర్స్, అగ్రికల్చర్ మార్కెట్,గ్రీన్ ఫిల్డ్ లలో పనిచేస్తున్న లారీ,టిప్పర్,హెవీ వెహికిల్ డ్రైవర్స్ కు కేసముద్రం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ రోడ్డు పై వెళ్తున్నపుడు సైనికుడు దేశం బోర్డర్ లో ఎంత జాగ్రత్తగా, బాధ్యతతో గస్తి కాస్తాడో అంతే బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు. డ్రైవర్స్ రూరల్ ఏరియా లో వెహికల్ నడుపుతునపుడు చిన్న పిల్లలను చూసి వెహికల్ నడపాలని సీఐ సూచించారు.డ్రంక్ అండ్ డ్రైవ్,మొబైల్ డ్రైవింగ్ చేస్తే వెహికల్ సిజ్ చేసి కోర్టు లో ప్రొడ్యూస్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వెహికల్ ఇన్సూరెన్స్ తప్పక కలిగివుండలని వెహికల్ కి ఇన్సూరెన్స్ లేకుండా,డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ ఆక్సిడెంట్ చేసి మరణానికి కారణం ఐనటలైతే వారిపై 104 బి ఎన్ ఎస్ యాక్ట్ ప్రకారం 10 సం.లు శిక్ష గల సెక్షన్స్ కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమం లో నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు, ఇనుగుర్తి ఎస్ఐ గంగారపు కరుణాకర్, కేసముద్రం ఎస్సై లు క్రాంతి కిరణ్, నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


