విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన…
– డ్రగ్స్ పదార్థాలపై అవగాహన సదస్సులో
ఈగల్ సెల్ ఏసీపీ మధు మోహన్ రెడ్డి, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి
కాకతీయ, దుగ్గొండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ రూపకల్పన లో భాగంగా దుగ్గొండి మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో స్థానిక ఎస్సై రావుల రణధీర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ మధు మోహన్ రెడ్డి, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పానీయాలు లను సేవించి అనారోగ్యం పాలు కావద్దని, వీటికి దూరంగా ఉంటూ మీ కుటుంబాలను కాపాడుకోవాలని ముఖ్యంగా విద్యార్థులు యువకులు అలవాటు పడి వారి ఉన్నతమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పంతో అవగాహన సదస్సులను మంగళవారం మహాత్మ జ్యోతి భా పూలే కళాశాల గిర్నిబావి, నాచిననపల్లి పరిషత్ సెకండరీ పాఠశాల, వెంకటాపురం గ్రామపంచాయితీ ఆవరణలో ఈగల్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అసిస్టెంట్ కమిషనర్ మధు మోహన్ రెడ్డి అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు అధికారులు యువకులు తో ప్రతిజ్ఞ చేయించి వారికి వాలీబాల్, క్రికెట్, కిట్ ఆటవస్తులను అధికారుల చేతుల మీదుగా ఏసిపి పంపిణీ చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 1908 తెలియపరచినట్లయితే మీ సమాచారం గోప్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రాజేశ్వర్ రావు, దుగ్గొండి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి రమణ, ఎంపీడీవో అరుంధతి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యులు ఎలగొండ రామస్వామి, కానిస్టేబుల్లు రంజిత్, శిరీష విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు.


