కాకతీయ, మహబూబాబాద్ టౌన్: గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్ లతో కలిసి జిల్లాకు కేటాయించిన గ్రామ పరిపాలన అధికారుల అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని (180) క్లస్టర్లకు గాను జిల్లాకు (163) మంది గ్రామ పరిపాలన అధికారులను కేటాయించడం జరిగిందని, అందులో స్థానిక అభ్యర్థులు (151) కాగా ఇతర జిల్లా నుండి (12 ) మందినీ కేటాయించారని, వారికి పూర్తి అవగాహన కల్పించి ప్రభుత్వ సూచనలు, నిబంధనల మేరకు ప్రధాన సమావేశ మందిరంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సర్టిఫికెట్లు పరిశీలించి, వారి నుండి ఆప్షన్స్ ఫారాలను స్వీకరించడం జరిగిందన్నారు.
సెప్టెంబర్ 5, శుక్రవారం ముఖ్యమంత్రి చేతుల ద్వారా ఉత్తర్వుల ఆర్డరు, అందజేయడం జరుగుతుందని, అందుకుగాను జిల్లా అభ్యర్థుల కోసం ఉదయం 6 గంటలకు కలెక్టర్ కార్యాలయ నుండి మూడు ప్రత్యేక బస్సుల ద్వారా అభ్యర్థులను తరలించడం జరుగుతుందని, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) తెలిపారు, ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు మదన్ గోపాల్, రాఘవ రెడ్డి, సిబ్బంది సునీల్ కుమార్, ఖయ్యూం, గ్రామ పరిపాలన అధికారుల అభ్యర్థులు పాల్గొన్నారు.


