తూర్పుకోటలో యువత పాత్రపై అవగాహన సదస్సు
సమాజ నిర్మాణములో యూవత పాత్ర అగ్రస్థానం : సీఐ రమేష్
కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్ తూర్పు కోట పోచమ్మ గుడి ఆవరణలో నేటి సమాజంలో యువత పాత్రపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఎస్‌ఐ నరేష్, 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ బొల్లం రమేష్ మాట్లాడుతూ, నేటి సమాజంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలని, ముఖ్యంగా డ్రగ్స్, మద్యపానం, చెడు అలవాట్లు, సోషల్ మీడియా మోసాలు, అపరిచితుల ప్రభావం వంటి వాటి ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
అపరిచితులు ఇచ్చే ఆఫర్లను నమ్మకూడదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తులను విశ్వసించవద్దని విద్యార్థులు, యువతకు సందేశం ఇచ్చారు.
“యువత మారితే సమాజం మారుతుంది… సమాజం మారితే దేశం మారుతుంది” అని సీఐ అన్నారు. యువత సమాజానికి అద్దంలాంటి వారు; వారు ఎలా ఆలోచిస్తే సమాజం కూడా అలా రూపుదాలుస్తుందని, మంచి ఆలోచనలు మంచి సమాజాన్ని నిర్మిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నాయకులు కందిమళ్ల మహేష్, అరసం రాంబాబు, సంగరబోయిన విజయ్, సంగరాబోయిన చందర్, చింతం అమర్ వర్మ, సంగరబోయిన ఉమేష్, ఎసిరెడ్డి రమేశ్, బిళ్ళ కిషోర్, చింతం రమేశ్, బేర వేణు, మంద శ్రీధర్, వనపర్తి ధర్మారాజు, వాసు, దుడయ్యా యూవత తదితరులు పాల్గొన్నారు.


