క్యాన్సర్ నివారణపై విద్యార్థులకు అవగాహన
కాకతీయ, తొర్రూరు : తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం క్యాన్సర్ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులతో క్యాన్సర్ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రాములు మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ క్రమం తప్పని వ్యాయామం చేయాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శాంతికుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సుజాత, డాక్టర్ వాల్యా నాయక్, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


