epaper
Sunday, March 1, 2026
epaper

వరంగల్ సీపీగా అవినాశ్ మహంతి ?

వరంగల్ సీపీగా అవినాశ్ మహంతి ?

రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం !
త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ !
జిల్లాలో లా అండ్ ఆర్డ‌ర్‌పై ప్ర‌త్యేక దృష్టి
సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం
పోలీస్ గ్రూపుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న పోస్టులు
ప్రస్తుతం సైబ‌రాబాద్ సీపీగా మ‌హంతి విధులు
ఆయ‌న తండ్రీ, సోద‌రుడు ఐపీఎస్ ఆఫీస‌ర్లే..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: వరంగల్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా అవినాశ్ మహంతిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రస్తుతం సైబ‌రాబాద్ సీపీగా విధులు నిర్వ‌హిస్తున్న అవినాష్ గ‌తంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా, సైబరాబాద్‌లో డీసీపీ (ట్రాఫిక్)గా, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్)గా ప‌నిచేశారు. కాగా మ‌హంతి నియామ‌కాన్ని స్థానిక మంత్రులు, కొంద‌రు ఎమ్మెల్యేలు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లా అండ్ ఆర్డర్‌ను అదుపులో పెట్టేందుకు మ‌హంతిని తీసుకొచ్చేందుకు సిద్ధ‌మైంద‌ని కొన్ని పోలీస్ గ్రూపులు, సోషల్ మీడియాలో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఐజీ స్థాయి అధికారి వరంగల్‌కు వచ్చే అవకాశం ఉందా ? అని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఒకే కుటంబంలో ముగ్గురు ఐపీఎస్‌లు

ప్రస్తుతం సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న అవినాష్ .. గ‌తంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా, సైబరాబాద్‌లో డీసీపీ (ట్రాఫిక్)గా, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్)గా విధులు నిర్వ‌హించారు. 2005 బ్యాచ్‌కు చెందిన‌ అవినాష్ మ‌హంతికి తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఈయ‌న తండ్రి సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఏకే మ‌హంతి. హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా, డీజీపీగా ప‌నిచేసి రిటైర్ అయ్యారు. సోద‌రుడు అభిషేక్ మ‌హంతి కూడా ఐపీఎస్ ఆఫీస‌రే. తాను ఎక్కడ ప‌నిచేసినా నిజాయతీకి మారుపేరులా, అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా వ్యవహరిస్తారని పేరుంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా ఆయ‌న తనదైన ముద్రవేశారు. క‌బ్దాదారులు, ఆర్థిక నేర‌గ‌ళ్ల‌పై ఉక్కుపాదం మోపారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అవినాష్ మ‌హంతి తండ్రి ఏకే మ‌హంతి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఏపీ గవర్నర్‌కి సలహాదారుగా వ్యవహరించారు. నిజాయతీ కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న ఏకే మహంతి ఇద్దరు కుమారులు అవినాష్‌, అభిషేక్ ఐపీఎస్ అధికారులే కావడం విశేషం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img