కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని కాచికల్ క్రాస్ నుంచి మేచరాజుపల్లి వరకు ప్రారంభించి ఇప్పటి కీ మరమ్మత్తులు చేయకపోవడంతో తీవ్రఇబ్బందులకు గురవుతున్నామని మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామస్తులు, ఆటో యూనియన్ ఆదివారం బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్డు మరమ్మతులకై రోడ్డు త్రవ్వకాలు ప్రారంభించి వదిలివేయగా ప్రమాదకరంగా గుంతలమయంగా రోడ్డు ఏర్పడడంతో అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ కు, ఆటో నడిచే పరిస్థితి లేదని పట్టించుకున్న నాథుడు లేడంటూ ఇప్పటికైనా ఎమ్మెల్యే రోడ్డు మంజూరు చేయించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.
ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ చిర్ర రమేష్ బాబు ఆందోళన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చచెప్పి ధర్నాను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఆటోయూనియన్, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


