epaper
Sunday, March 1, 2026
epaper

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు
ఢిల్లీ బంగ్లా హైకమిషనర్‌కు సమన్లు
“ఎన్నికలను అస్థిరపర్చేందుకే అన్నను చంపేశారు” – ఒమర్ హాదీ

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాల చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ కీలక దౌత్య చర్యకు దిగింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసి వివరణ కోరింది. మైనారిటీల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బంగ్లా ప్రభుత్వ వైఖరిని ఖండించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం, మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేయడం ద్వారా భారత్‌ తన ఆందోళనను అధికారికంగా తెలియజేసింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని దౌత్య చర్యలు తీసుకుంటామని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి.

షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో హాదీ కీలక పాత్ర

ఇదిలా ఉండ‌గా బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న ఉస్మాన్ హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం ఉందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాదీ సోదరుడు ఒమర్ హాదీ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే తన అన్నను హత్య చేశారని ఆరోపించారు. ఎన్నికలను అస్థిరపర్చాలనే ఉద్దేశంతోనే ఈ హత్యకు పాల్పడ్డారని అన్నారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఉస్మాన్ హాదీ కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే కారణంగా ఆయనను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ నెల 12న హాదీపై కాల్పులు జరగగా, తీవ్రంగా గాయపడిన ఆయన ఈ నెల 18న మృతి చెందారు. హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా హిందూ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయాలు, ఇళ్లు, వ్యాపారాలపై దాడులు జరిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ, భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img