epaper
Saturday, January 24, 2026
epaper

మట్టి రవాణాపై ప్ర‌శ్నించినందుకు దాడి

మట్టి రవాణాపై ప్ర‌శ్నించినందుకు దాడి
వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లం న‌ల్ల‌బెల్లి గ్రామ స‌ర్పంచ్ భ‌ర్త‌పై కాంగ్రెస్ నేత‌ల‌ దాడి!
పిడిగుద్దులు, హెల్మెట్‌తో ఇష్టానుసారంగా మూకుమ్మ‌డిగా అటాక్‌

కాకతీయ, వర్ధన్నపేట : వర్ధన్నపేట నియోజకవర్గంలో అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్న సర్పంచ్ భర్తపై దాడి జరగడం కలకలం రేపింది. నల్లబెల్లి గ్రామంలో మట్టి అక్రమ రవాణాను ప్రశ్నించిన సర్పంచ్ భర్త *శ్రీకాంత్*పై స్థానిక కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం, నల్లబెల్లి పరిధిలో జరుగుతున్న అక్రమ మట్టి రవాణాను శ్రీకాంత్ అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు అతడిపై పిడిగుద్దులతో పాటు హెల్మెట్‌తో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. అక్రమ కార్యకలాపాలను అడ్డుకున్నందుకే దాడికి పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ రవాణాపై ప్రశ్నించినందుకే..?!
గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తరలింపు జరుగుతోందని, దీనిపై గత కొంతకాలంగా ఫిర్యాదులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ భర్తగా శ్రీకాంత్ గ్రామ ప్రయోజనాల కోసం అక్రమ రవాణాను అడ్డుకున్నారని తెలిపారు. అయితే దీనికి ప్రతీకారంగా దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత పెరిగింది. అక్రమ మట్టి రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
దాడి ఘటనపై పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపైనే దాడులు జరగడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జాతరకు ఆర్టీసీ బస్సులోనే రండి….

జాతరకు ఆర్టీసీ బస్సులోనే రండి.... మేడారం జాతరకు భారీ రవాణా ఏర్పాట్లు. 4000 ఆర్టీసీ...

మేడారం జాతరకు మచ్చ పడేనా..?

మేడారం జాతరకు మచ్చ పడేనా..? జంపన్న వాగు లెవలింగ్ పనులపై అనుమానాలు జాతరకు ముందే...

తౌడు లోడు లారీ బోల్తా

తౌడు లోడు లారీ బోల్తా వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై తప్పిన ఘోర ప్రమాదం డ్రైవర్,...

జర్నలిస్ట్ కుటుంబానికి 60 వేల ఆర్థికసహాయం

జర్నలిస్ట్ కుటుంబానికి 60 వేల ఆర్థికసహాయం కాకతీయ, నెల్లికుదురు : టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్...

వచ్చే సారికి చూద్దాం..!

వచ్చే సారికి చూద్దాం..! ఈ సీజన్ కు తాత్కాలికంగా వసతులు చేపట్టండి ముసలమ్మకుంట...

మహిళలే మహారాణులు

మహిళలే మహారాణులు కోటి మంది మ‌హిళ‌లు కోటీశ్వరులే లక్ష్యం మహిళల అభ్యున్నతికి రూ.40 వేల...

జంపన్నవాగులో మునిగిన ముగ్గురికి పునర్జన్మ

జంపన్నవాగులో మునిగిన ముగ్గురికి పునర్జన్మ మునిగిపోతున్న ముగ్గురిని ర‌క్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాకతీయ, ములుగు...

ఆ క‌థ‌నం అస‌త్యం

ఆ క‌థ‌నం అస‌త్యం కొమ్మాల ఆల‌యంలో అవకతవకల్లేవు నిబంధనల ప్రకారమే వేతనాలు, ఖర్చులు ఓ ప‌త్రిక‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img