బయ్యారం కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిపై దాడి
పార్టీ అంతర్గత విబేధాలతో మూకుమ్మడిగా అటాక్
పీఏసీఎస్ సొసైటీ మాజీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డిపై బాధితుడి ఫిర్యాదు
కాకతీయ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నాయిని శ్రినివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం కొంతమంది సొంత పార్టీ నేతలే దాడికి పాల్పడ్డారు. పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విబేధాలు,కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం బస్టాండ్ సెంటర్ సమీపంలోని డీసీసీ బ్యాంక్ ఎదురుగా వేచి ఉన్ననాయిని శ్రీనివాస్‌రెడ్డిపై పీఏసీఎస్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నేత మూల మధుకర్ రెడ్డి ప్రోద్బలంతో తిరుమల చంద్రారెడ్డి , వేల్పుల శ్రీనివాసు, మండ నాగరాజు, వెంకట పతి మరికొంత మంది కలిసి దాడి చేసినట్లుగా బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బయ్యారం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై కాకతీయ డీఎస్పీ తిరుపతిరావును వివరణ కోరగా దాడి చేసిన విషయంపై సమాచారం లేదని, , ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు


