మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం…
ఎనిమిది సంవత్సరాల పాపపై కిరాణా షాప్ యజమాని కుమారుడు అఘాయిత్యం…
కాకతీయ, వరంగల్ సిటీ : మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్సు హరిజనవాడ ఎస్సీ కాలనీలో ఓ కిరాణా షాప్ నడుపుతున్న వేల్పుగొండ కుమారుస్వామి కుమారుడు కమల్ అలియాస్ అమ్ము అనే వ్యక్తి అదే కాలనీలో నివాసముంటున్న 8 సంవత్సరాల బాలికపై లైంగిక వేధింపులు చేసిన సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం కూల్ డ్రింక్ తీసుకురమ్మని పాపని కిరాణా షాప్ కు పంపగా కొంత సమయానికి పాప ఏడ్చుకుంటూ రావడంతో ఏం జరిగిందని అడగగా పాప షాపుకు వెళ్ళిన సమయంలో కమల్ ఒక్కడే ఉన్నాడానీ, కూల్ డ్రింక్ ఇవ్వమని అడగగా కూల్ డ్రింక్ ఇవ్వకుండా చాక్లెట్ ఆశ చూపి వెనక ఉన్న బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి ముద్దులు పెడుతూ దుస్తులు విప్పుతుండగా అదే సమయంలో కిరణం షాప్ లోకి వేరే వ్యక్తి వచ్చాడని ఆ సమయంలో పాపను వదలడంతో తప్పించుకొని వచ్చానని విషయం తల్లిదండ్రులకు చెప్పగా పాప ద్వారా విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


