కాకతీయ, క్రైమ్ డెస్క్: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ లో ఐదుగురు మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనుమానాస్పద స్థితిలో ఉన్న డెడ్ బాడీలను మియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. మరణించిన వారంా కర్నాటక రాష్ట్రంలోని గుల్బార్గా జిల్లా సేడం మండలం రంజోలికి చెందిన లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవితగా గుర్తించారు. వీరితోపాటు ఓ రెండు సంవత్సరాల చిన్నారి కూడా మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే వీరి మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.


