నిజామాబాద్ లో దారుణం
కానిస్టేబుల్ ను హత్య చేసిన దొంగ
కాకతీయ, నిజామాబాద్: బైక్ చోరీ నిందితుడు కత్తితో జరిపిన దాడిలో సీసీఎస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో శుక్రవారం రాత్రి 8.40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. క్రైం కంట్రోల్ స్టేషన్కు చెందిన ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ ప్రమోద్.. నగర శివారులోని నాగారం నుంచి బైక్ చోరీ నిం దితుడైన రియాజ్ను అరెస్టు చేసి తీసుకొస్తున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ బైక్ నడుపుతుండగా, రియాజ్ మధ్యలో, వెనుక ఎస్ఐ విఠల్ కూర్చున్నారు. వారి బైక్ వినాయక్ నగర్ వద్దకు రాగానే నిందితుడు రియాజ్.. బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ గొంతును గట్టిగా పట్టుకున్నాడు. ఊపిరాడక కానిస్టేబుల్ బైక్ను నిలిపివేయగానే కత్తి తీసి ఛాతీలో పొడిచాడు. కానిస్టేబుల్ రక్తపు మడుగులో పడిపోగానే, భయపడిన ఎస్ఐ విఠల్ అక్కడి నుంచి దూరం గా వెళ్లడంతో నిందితుడు పారిపోయాడు. తర్వాత ఎస్ఐ విఠల్.. కానిస్టేబుల్ ప్రమోద్ను ఆటోలో ఆస్పత్రికి తరలిం చారు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందారు. నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


