epaper
Thursday, January 15, 2026
epaper

ఏటీఎంల‌లో రేకు అడ్డం పెట్టి దోచేస్తారు

ఏటీఎంల‌లో రేకు అడ్డం పెట్టి దోచేస్తారు
ఏటీఎంలో చోరీల‌కు పాల్ప‌డుతున్న ముఠా అరెస్టు
వరంగల్ ట్రైసిటీలో 7 ఏటీఎంలలో రూ.12.10 లక్షల చోరీ
దేశవ్యాప్తంగా 40కి పైగా ఏటీఎం చోరీల రికార్డు
టెక్నాలజీతో ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

కాకతీయ, వరంగల్ బ్యూరో : ఏటీఎం మిషన్లలో డబ్బులు బయటకు రాకుండా ఇనుప రేకును అమర్చి ఖాతాదారులను మోసం చేస్తూ చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర ముఠా గుట్టును వరంగల్ పోలీసులు ఛేదించారు. వరంగల్ సీసీఎస్‌, కాజీపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు ఆరిఫ్ ఖాన్, సర్ఫరాజ్, ఎం. ఆష్ మహ్మద్, షాపుస్ ఖాన్, షారూఖాన్, అస్లాం ఖాన్, ఎం. షారుఖాస్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా మాల్కిడా తాలూకాకు చెందినవారిగా వెల్లడించారు.

ఏటీఎం చోరీల వెనుక ముఠా ప్లాన్

డీసీపీ కవిత వెల్లడించిన వివరాల ప్రకారం… ఒకే ప్రాంతానికి చెందిన ఈ నిందితులు మద్యం సేవిస్తూ సన్నిహితంగా గడుపుతూ, ఖర్చులకు డబ్బు లేకపోవడంతో సులభంగా సంపాదించేందుకు నేర మార్గాన్ని ఎంచుకున్నారు. ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్‌బీఐకి సంబంధించిన పెర్టో కంపెనీ పాత ఏటీఎం మిషన్ల లోపాలను తెలుసుకుని, వాటిని తెరవడానికి నకిలీ తాళం చెవులు తయారు చేసుకున్నారు. ముందుగా పెర్టో ఏటీఎంలను గుర్తించి, మిషన్‌లో డబ్బులు బయటకు వచ్చే మార్గంలో గమ్‌తో ఇనుప ప్లేట్ అమర్చేవారు. ఖాతాదారుడు నగదు డ్రా చేస్తే డబ్బు బయటకు రాకుండా మిషన్‌లోనే ఆగిపోయేది. నగదు రాకపోవడంతో ఖాతాదారుడు మిషన్ లోపంగా భావించి వెళ్లిపోతాడు. అనంతరం నిఘా పెట్టిన ముఠా సభ్యులు మళ్లీ ఏటీఎం తెరిచి లోపల నిలిచిపోయిన నగదును దోచుకునేవారు. ఖాతాదారుడికి మాత్రం నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చేది.

దేశవ్యాప్తంగా 40కి పైగా చోరీలు

ఈ పద్ధతితో నిందితులు రాజస్థాన్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో 40కి పైగా ఏటీఎం చోరీలకు పాల్పడ్డారు. పాత మిషన్ల స్థానంలో కొత్త ఏటీఎంలు ఏర్పాటు కావడంతో కొన్ని రాష్ట్రాల్లో వీరి కార్యకలాపాలు తగ్గగా, ఇటీవల వరంగల్ ట్రైసిటీని లక్ష్యంగా చేసుకున్నారు. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు వరంగల్ ట్రైసిటీలోని 7 ఏటీఎంలలో చోరీలు చేసి రూ.12.10 లక్షల నగదు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుబేదారి పరిధిలో నాలుగు, కాజీపేట, హనుమకొండ, మిల్స్ కాలనీ పరిధిలో ఒక్కొక్క ఘటన నమోదైంది. ఈరోజు ఉదయం కాజీపేట చౌరస్తా సమీపంలోని పెర్టో ఏటీఎం వద్ద మరోసారి చోరీకి ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పారిపోవడానికి యత్నించినా పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాలను అంగీకరించారు. కేసును ఛేదించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఏసీపీలు సదయ్య, ప్రశాంత్ రెడ్డి, సీసీఎస్ ఎస్‌ఐ శ్రీనివాస్ రాజు, కాజీపేట ఎస్‌ఐలు నవీన్ కుమార్, లవణ్ కుమార్‌తో పాటు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img