epaper
Sunday, March 1, 2026
epaper

ఈట‌ల వ‌ర్సెస్ బండి !

 

ఈట‌ల వ‌ర్సెస్ బండి !
క‌రీంన‌గ‌ర్ క‌మ‌ల ద‌ళంలో వ‌ర్గ‌పోరు !
ఇరు వ‌ర్గాల మ‌ధ్య మ‌రోసారి మాట‌ల మంట‌లు
హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చుట్టూతే క‌మ‌లంలో ర‌గ‌డ‌
స్థానిక ఎన్నిక‌ల్లో బీఫాం నేనే ఇస్తా అన్న ఈట‌ల‌
అధిష్ఠానం నిర్ణ‌య‌మే ఫైన‌లంటూ జిల్లా అధ్య‌క్షుడు గంగిరెడ్డి కౌంట‌ర్
కాషాయ పార్టీలో మ‌ళ్లీ ప్ర‌చ్చ‌న్న యుద్ధం
గ‌తంలో బండిపై ప‌రోక్షంగా ఈట‌ల ఘాటు వ్యాఖ్య‌లు
తాజాగా హుజురాబాద్‌లో ప్రెస్‌మీట్ అనంత‌రం పెరిగిన వాడీవేఢీ రాజ‌కీయం

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : తెలంగాణ బీజేపీలో కీల‌క నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మ‌రోమారు బ‌య‌ట‌పడింది. ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజ‌య్ వ‌ర్గం.. ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మ‌ధ్య విభేదాలు మ‌రోమారు పొడ‌చూపాయి. హుజురాబాద్ పార్టీ నేత‌ల విష‌యంపై మొద‌లైన వివాదం రోజురోజుకూ ముదురుతున్నాయి. త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైన నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్ప‌టికప్పుడు అధిప‌త్యాన్ని నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో ఈట‌ల మాటాలు తూటాలు పేలుస్తుంటే .. పార్టీ అధిష్ఠానం నిర్ణయమే ఫైన‌ల్ అంటూ అని బండి సంజ‌య్ వ‌ర్గం కౌంట‌ర్లు ఇస్తుండ‌టం క‌మ‌ల‌ద‌ళంలో క‌ల‌క‌లం రేపుతోంది. గ‌తంలోనూ ఈట‌ల రాజేంద‌ర్, బండి సంజ‌య్ మ‌ధ్య పేర్లు ప్ర‌స్తావించ‌కుండా డైలాగ్ వార్‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. నీ శ‌క్తి ఏంది.. నీ స్థాయి ఏంది.. నీ చ‌రిత్ర ఏంది.. మా చ‌రిత్ర ఏంది..? అంటూ బండి సంజ‌య్ పేరు ప్ర‌స్తావించ‌కుండా ఈట‌ల ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి విదిత‌మే.

మాట‌లు.. మంట‌లు

రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌లకు ప్ర‌స్తుతానికి బ్రేక్ ప‌డినప్ప‌టికీ బీజేపీలో టికెట్ల పొరు క‌నిపిస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ల కేటాయింపుల‌కు సంబంధించి ఎవ‌రు సుప్రీం లీడ‌ర్ అన్న విష‌యంపైనే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈట‌ల‌కు చెక్ పెట్టేందుకు బండి సంజ‌య్ వ‌ర్గం పావులు క‌దుపుతుండ‌గా.. తిరిగి తాను హుజురాబాద్‌కే వ‌స్తా.. ఈ గ‌డ్డే నాకు శాశ్వ‌త అడ్డా అంటూ ఈట‌ల సంకేతాలిస్తూ క్యాడ‌ర్‌ను కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం గ‌మనార్హం. ఇక‌పై త‌ర‌చూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తా.. న‌మ్మినోళ్ల‌కు.. న‌మ్ముకున్నోళ్ల‌కు అండ‌గా ఉంటానంటూ ఇటీవ‌ల భ‌రోసా ఇస్తున్నారు. అందులో భాగంగానే ఐదు రోజుల క్రితం హుజురాబాద్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో బీఫాం ఇచ్చేది నేనేనంటూ వ్యాఖ్య‌నించారు. 25 సంవ‌త్స‌రాల నుంచి నేనే ఇక్క‌డ లీడ‌ర్.. ఇక్క‌డ పార్టీకి బ‌లం చేకూర్చింది నేనే.. బీఫామ్స్ ఇచ్చేది కూడా మేమే.. అంటూ రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఆ పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి. కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ను ఉద్దేశించి ప‌రోక్షంగా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారంటూ సొంత పార్టీలోనే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈట‌ల‌కు గంగిరెడ్డి కౌంట‌ర్..!

ఈ విష‌యంలో ఈట‌ల‌పై బండి సంజ‌య్ వ‌ర్గం గుర్రుగా ఉంది. ఈట‌ల కామెంట్స్‌ను కోట్ చేస్తూ బండి సంజ‌య్ ప్ర‌ధాన అనుచ‌రుడు, జిల్లా అధ్య‌క్షుడు గంగిరెడ్డి కృష్ణారెడ్డి ఈట‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. బీఫాంలు ఇచ్చేది వ్య‌క్తులు కాదు..అధిష్ఠానం..అధిష్ఠానంనిర్ణ‌య‌మే ఫైన‌ల్‌.గ్రూపులు, వ‌ర్గాలుగా కొనసాగుతున్న అనుచ‌రుల‌కు టికెట్లు, బీఫామ్స్ ఇచ్చే సంప్ర‌దాయం బీజేపీలో లేదంటూ పేర్కొన్నారు.
ముఖ్య‌మంటూ ఈట‌ల మాట‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌డం క‌రీంన‌గ‌ర్ కాషాయ పార్టీలో సెగ‌లు రేపింది. ఈ సెగ‌లు ఇప్ప‌ట్లో ఆరే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు మొద‌ల‌య్యే నాటికి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం కాస్త వాడీ వేఢీ రాజ‌కీయ‌మే ఉంటుంద‌న్న విశ్లేష‌ణ జిల్లాలో జ‌రుగుతోంది.

ఈట‌ల‌కు బ‌ల‌మైన పునాది హుజ‌రాబాద్‌.

తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ పేరు చెబితే హుజురాబాద్ గుర్తుకొస్తుంది. రాజకీయంగా ఆయనకు బలమైన పునాది అందించిన నియోజకవర్గం అదే. రాజకీయ జీవితంలో ఎన్ని మలుపులు వచ్చినా, ఎన్ని మార్పులు జరిగినా ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ ప్రాధాన్యం మాత్రం తక్కువ కాలేదు. ఆయన టీఆర్ఎస్‌లో మంత్రిగా ఉన్నప్పుడు అయినా, ఆ తర్వాత బీజేపీలో చేరినప్పుడు అయినా హుజురాబాద్‌ తన రాజకీయ ప్రయాణానికి కేంద్ర బిందువుగానే నిలిచింది. ప్ర‌స్తుతం మ‌ల్కాజ్‌గిరీ ఎంపీగా ఉన్న ఆయన.. హుజురాబాద్‌లో తన ప్రాబల్యం యథావిధిగా కొనసాగుతుందనే సంకేతాలు పంపుతున్నారు. ఈక్ర‌మంలోనే.. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, ఇది కేవలం వ్యక్తిగత పదవుల పోటీ కాదు, హుజురాబాద్‌ను ఆధిపత్యంగా చూపించుకునే ప్రయత్నం అని పార్టీలో పలువురు భావిస్తున్నారు.

గ‌తంలో బండిపై ఈట‌ల ఫైర్‌.. ఇప్పుడు మ‌ళ్లీ

గతంలోనూ ఈటల రాజేందర్ బండి సంజయ్‌ను ఉద్దేశించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయ‌న పేరు ప్ర‌స్తావించ‌కుండానే తీవ్ర‌మైన ప‌ద‌జాలం ఉప‌యోగించి హెచ్చ‌రించిన సంగ‌తి విదిత‌మే. అయితే ఆ సమయంలో అధిష్ఠానం పెద్ద‌లు..ఈవ్య‌వ‌హారాన్ని సమసిపోయేలా చూసింద‌ని స‌మాచారం. అయితే అప్పటి నుంచి ఇరు వర్గాలు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, ఈసారి మళ్లీ మాటల యుద్ధం మొదల‌వ‌డం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈటల వర్గం హుజురాబాద్‌లో తన దృష్టిని మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తుండగా, బండి వర్గం మాత్రం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేస్తోంది. దీంతో ఈ నియోజకవర్గం చుట్టూ తిరిగే ఈ పరిణామాలు, పార్టీ అంతర్గత శక్తి సమీకరణాలపై ప్రభావం చూపుతున్నాయి. హుజురాబాద్‌ నుంచి ఉద్భవించిన ఈ పొలిటికల్ పేచీ, ఇప్పుడు బీజేపీకి రాష్ట్ర వ్యాప్త సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.వ‌

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img