- ద్విచక్ర వాహనం, 25 ప్యాకెట్ల నాటుసారా స్వాధీనం
కాకతీయ, ఆత్మకూరు: గుడుంబా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు సీఐ సంతోష్ అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలకేంద్రంలో ద్విచక్ర వాహనంలో గుడుంబా తరలిస్తున్న భూక్యా కళ్యాణి, భూక్యా దాసులను పట్టుకున్నామని సిఐ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా గుడుంబా అమ్మినట్టు తెలిసినా, విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. భూక్యా కళ్యాణి, భూక్యా దాసు నుండి 25 ప్యాకెట్ల గుడుంబాను పట్టుకున్నామని, దాని విలువ సుమారు రూ.10వేలు ఉంటుందని, అలాగే ద్విచక్ర వాహానాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్సై తిరుపతి, సతీష్, కానిస్టేబుల్ రమాదేవి, అనిల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


