- రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం
- సీఐ గట్ల మహేందర్ రెడ్డి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలో టౌన్ ఎస్ఐ మౌనిక కథనం ప్రకారం..తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా స్థానిక నిజాంచెరువుకట్ట సమీపంలో ఐదుగురు యువకులు అనుమానాస్పదంగా తచ్చాడన్నారు. వారిని తనిఖీ చేయగా గంజాయి కలిగి ఉండడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం ఎస్ ఐ పెట్రో లింగ్ చేస్తుండగా పోలీసులు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు.
వెంటనే సిబ్బంది సహకారంతో వారిని పట్టుకుని వారిని విచారించగా కురవి మండలానికి చెందిన లూనావత్ రవీందర్, భూక్యా సాయిరాం, మహబూబాబాద్ పట్టణానికి చెందిన భూక్య వినోద్ , లావుడ్య పవన్, భూక్య కుమార్ , భూక్య సాయిరాంలను విచారించామన్నారు. వీరారం తండాకు చెందిన బాదావత్ ప్రశాంత్ భద్రాచలం అరకు ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరకు తెచ్చి వారికి అమ్మేవాడని తెలిపారు. అతడి దగ్గర గంజాయిని కొనుక్కొని తాగడమే కాకుండా ఇతరులకు విక్రయి స్తున్నట్టు తెలుపడం తో వారిని చెక్ చేయగా వారి వద్ద నుంచి చిన్న పొట్లాలుగా కట్టిన సుమారు లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల విలువైన రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


