epaper
Monday, March 2, 2026
epaper

కరుడుగట్టిన నేరస్తుల అరెస్టు

  • నిందితుల నుంచి మారణాయుధాలు స్వాధీనం
  • గ్యాంగ్‌స్టర్ సురేందర్ సహా నిందితుల పట్టివేత
  • భీమారం బేస్‌గా హన్మకొండలో కార్యకలాపాలు

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్‌లో గ్యాంగ్‌ నడిపిస్తున్న సీరియల్‌ నేరస్తుడు దాసరి సురేందర్‌ అలియాస్‌ సూరి అలియాస్‌ మొయిన్‌ అలియాస్‌ మునీర్‌ (39)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాయంపేట పోలీసులు ఆదివారం ఉదయం వాహన తనిఖీల సమయంలో సురేందర్‌ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రెండు దేశీయ పిస్టల్స్‌, లైవ్‌ రౌండ్‌, మ్యాగజైన్‌లు, బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో వరంగల్‌ జిల్లా పోలీస్‌ వర్గాల్లో కలకలం రేగింది.

వాహన తనిఖీలో పిస్టల్స్ స్వాధీనం ..

హనుమకొండ జిల్లా శాయంపేట పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ జె. పరమేశ్వర్‌ సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం 6.30 గంటలకు కొత్తగట్టు, సింగారం క్రాస్‌రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గుడెప్పాడ్‌ దిశనుంచి రెండు బైక్‌లపై వస్తున్న ఏడుగురిని ఆపగా, వారు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటాడి పట్టుకుని విచారించగా, వారి వద్ద దేశీయంగా తయారు చేసిన తుపాకులు, మ్యాగజైన్‌లు, లైవ్‌ రౌండ్‌లు లభించాయి. నిందితులు దాసరి సురేందర్‌, సామ్రాజ్‌ శ్రీ చక్రి, చుంచు రాహుల్‌, నమిండ్ల శివమణి, రౌతు శివ వైభవ్‌, సామ్రాజ్‌ క్రాంతి, ఎనుగల నితిన్‌, ఆదిత్య కుమార్‌ ఠాకూర్‌ లను పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, బుడిగె తరుణ్‌, రేణుకుంట్ల ప్రదీప్‌, సాయి లక్కీ అలియాస్ సాయి శివ‌, లోఖి, ముస్కే రవితేజ లు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు సురేందర్‌ వద్ద నుంచి ఐరన్‌ పిస్టల్‌, మ్యాగజైన్‌, లైవ్‌ రౌండ్‌, చక్రి వద్ద నుంచి దేశీయ తుపాకీ, మ్యాగజైన్‌, రాహుల్‌ వద్ద నుంచి, హోండా డియో స్కూటీ, శివమణి వద్ద నుంచి బజాజ్‌ పల్సర్‌ బైక్‌, నితిన్‌, ఆదిత్య ఠాకూర్‌ వద్ద నుంచిమొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు.

గ్యాంగ్‌ కార్యకలాపాల వెల్లడి..

పోలీసుల విచారణలో సురేందర్‌ గ్యాంగ్‌ మద్యం, గంజాయి సేవిస్తూ పార్టీల్లో గాలిలోకి కాల్పులు జరిపినట్లు తేలింది. జైలులో ఉన్న సమయంలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన ఆదిత్య ఠాకూర్‌ను పరిచయం చేసుకొని అతని ద్వారా తుపాకులు తెప్పించుకున్నాడు.తన అనుచరుడు భూపాలపల్లికి చెందిన బాసిత్‌ ముఠా యుద్ధంలో హతమైన తర్వాత, అతని సమాధి వద్ద ప్రతీకారంగా గాలిలోకి కాల్పులు జరిపారని సురేందర్‌, చక్రి ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మాందారిపేట ఘటనలోనూ వీరే..!

గత నెల 18న మాందారిపేట గ్రామంలో ఒక లారీని ఆపి డ్రైవర్‌పై పిస్టల్‌తో దాడి చేసిన ఘటన, పెట్రోల్‌ పంప్‌లో రూ.200 పెట్రోల్‌ తీసుకుని డబ్బు చెల్లించకుండా కార్మికుడిని బెదిరించిన ఘటనల్లోనూ ఇదే గ్యాంగ్‌ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వీరు హైదరాబాద్‌ పారిపోయి, తిరిగి హన్మకొండకు వచ్చి కేసు ఉపసంహరించుకునేందుకు పెట్రోల్‌ బంక్‌ ఉద్యోగిని బెదిరించాలని ప్లాన్‌ చేసినట్లు తేలింది. కాగా, వీరు గంజాయి సేవించినట్లు నిర్ధారణ చేశారు. వీరిపై హత్యలు, దోపిడీలు, అత్యాచారం, చోరీలు, పీడీ చట్టం, పోక్సో చట్టం కింద 40కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2008 నుంచి 2022 వరకు చౌట్‌ అప్పల్‌, బోయినపల్లి, మాధాపూర్‌, మీర్‌పేట‌, ఎల్‌బీ నగర్‌, హయత్‌నగర్‌, నార్సింగ్‌, బాలాపూర్‌ తదితర స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. శాయంపేట ఎస్ఐ జె. పరమేశ్వర్‌ మాట్లాడుతూ.. నిందితులు అక్రమంగా తుపాకులు దాచుకొని భయ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. వీరిపై ఆర్మ్స్ యాక్ట్, ఎన్ డి పి ఎస్ యాక్ట్, కొత్త బి ఎన్ ఎస్ చట్టాల కింద కేసులు నమోదు చేశాం. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img