దళిత బంధు సమితి సభ్యుల అరెస్ట్
కాకతీయ, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన నేపథ్యంలో జమ్మికుంట పోలీసులు దళిత బంధు సాధన సమితి సభ్యులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. రెండో విడత దళిత బంధు నిధులు మంజూరు చేయాలని నిరసన తెలిపే అవకాశం ఉందని అందుకోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దళిత బంధు నిధులు ఇవ్వకుండా మమ్మల్ని అరెస్టు చేయడం సరికాదని సమితి సభ్యులు మండిపడ్డారు. అరెస్టు అయిన వారిలో నరేష్, ప్రశాంత్, ప్రవీణ్, రక్షిత్ ఉన్నారు.


