“పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి”
•జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రభుత్వ నిబంధనలు,మార్గదర్శకాల ప్రకారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా,శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య సూచించారు. ఈ నెల 4న నిర్వహించనున్న పరోక్ష ఎన్నికల దృష్ట్యా బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం,ఎన్నికల వేదికలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,ఎన్నిక నోటీసులను ఎన్నికైన కౌన్సిలర్లకు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సిలర్లకు కూర్చునే ఏర్పాట్లు,భద్రతా,ప్రవేశ–నిష్క్రమణ మార్గాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చట్టం–శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక ఏసీపీ,సీఐలు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని,ఎటువంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్,సీఐ రమేష్,తహసీల్దార్ సతీష్,మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.


