epaper
Monday, March 2, 2026
epaper

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి
క్యూ లైన్ నిర్మాణంలో వేగం పెంచాలి
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
ఆలయ ప్రాంగణంలో మౌలిక వసతుల పర్యవేక్షణ

కాకతీయ, ములుగు ప్ర‌తినిధి : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతరకు ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా క్యూ లైన్ నిర్మాణాల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. శనివారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.

ఆదివారం భక్తుల రద్దీపై అప్రమత్తత

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం సెలవు రోజు కావడంతో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మోడల్ క్యూ లైన్ల నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన, పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని, క్యూ లైన్లలో నిల్చున్న భక్తులకు తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని భారీ రాతి స్తంభాలపై త్వరితగతిన బ్రాకెట్లను ఏర్పాటు చేయాలని, ఫ్లోరింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ స్తంభాల ఏర్పాటు ద్వారా రాత్రివేళల్లో కూడా భక్తులకు సౌకర్యం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి అభివృద్ధి పని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వీరస్వామి, ఆర్ అండ్ బి ఈఈ సురేష్, తహసిల్దార్ సురేష్‌బాబు, సంబంధిత గుత్తేదారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ

శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్...

బీఆర్ ఎస్ ఖాతాలో తొర్రూరు మునిసిపాలిటీ

బీఆర్ ఎస్ ఖాతాలో తొర్రూరు మునిసిపాలిటీ 16లో 9 వార్డుల్లో బీఆర్‌ఎస్ విజయం 7...

కేసీఆర్‌ను విచారించనున్న సిట్

కేసీఆర్‌ను విచారించనున్న సిట్ మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లో విచార‌ణ ఆరంభం ఎర్రవల్లి నుంచి...

కార్పొరేషన్ ఎన్నికల్లో “కారు” స్పీడ్ పెంచాలి

కార్పొరేషన్ ఎన్నికల్లో "కారు" స్పీడ్ పెంచాలి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల వద్దకు...

రైతు ఐడీ తప్పనిసరి!

రైతు ఐడీ తప్పనిసరి! 2026 నుంచి పీఎం కిసాన్ లబ్ధికి షరతు అగ్రిస్టాక్‌తో డిజిటల్...

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు కాకతీయ, కరీంనగర్...

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం కాకతీయ, గణపురం : మేజర్ గ్రామపంచాయతీ...

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్..

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్.. పేరు మార్చుతూ కేంద్రం నిర్ణయం కొత్త భవనంలోకి మారనున్న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img