epaper
Friday, March 13, 2026
epaper

మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు

మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు
క్షేత్ర‌స్థాయిలో ఎస్పీతో క‌లిసి మంత్రి సీత‌క్క ప‌రిశీల‌న‌
చిలకలగుట్టలో భక్తుల రాకపోకలపై అధికారుల‌కు సూచ‌న‌లు
ట్రైబల్ మ్యూజియం పనుల పురోగతిపై సమీక్ష
భక్తులకు లోటుపాట్లు లేకుండా ప్రత్యేక చర్యలు
భద్రతకే ప్రథమ ప్రాధాన్యం : మంత్రి సీత‌క్క‌

కాకతీయ, ములుగు ప్రతినిధి :శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ *సుధీర్ రామ్‌నాథ్ కేకన్*లతో కలిసి మేడారం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

చిలకలగుట్టలో ఏర్పాట్ల పరిశీలన

ముందుగా చిలకలగుట్ట ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి, అక్కడ భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాల పరిస్థితిని పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేలా మ్యూజియాన్ని సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మద్యం సేవించి జంపన్న వాగులోకి వెళ్లవద్దని భక్తులకు హెచ్చరించారు. మేడారం చేరుకున్న వెంటనే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం అమ్మవార్ల దర్శనం చేసుకుని వంటావార్పు నిర్వహించుకోవాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేక జాగ్రత్తలు

జాతర సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులను ఒంటరిగా ఎక్కడికీ వదిలివేయకూడదని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసే ఉండాలని, ఎవరికైనా దారి తప్పితే వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బంది లేదా అధికారులను సంప్రదించాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, దర్శన సౌకర్యాలు వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సీతక్క మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది రావిరాల లో 10 లక్షల...

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ కాకతీయ, గీసుగొండ: దేశం...

న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం

న్యాయం చేయండి.... అర్హురాలికి అన్యాయం... - అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు - మెరిట్...

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆవేదన కాకతీయ, ములుగు ప్రతినిధి:...

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం - కోట్ల రూపాయలు వసూలు...

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట! ప్రభుత్వ విప్, డాక్టర్ జాటోతు. రామచంద్రు నాయక్, కాకతీయ,మరిపెడ:...

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట!

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట! ప్రభుత్వ విప్, జాటోతు. రామచందర్ నాయక్, కాకతీయ,మరిపెడ: ఆరోగ్య...

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కాకతీయ, పెద్దవంగర :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img