epaper
Thursday, March 26, 2026
epaper

9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ

9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ..

ఏడాదికి 4 లక్షల మందికి ఉచిత సేవ‌లు

ఇప్ప‌టికీ రూ. 2400 కోట్లకుపైగా పేమెంట్స్

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ 9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. గతంలో ఏడాదికి సగటున రెండున్న లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందగా, ఇప్పుడు ఏడాదికి 4 లక్షల మంది ఆరోగ్యశ్రీని వినియోగించుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ బకాయిలు, ఇతర అంశాలపై గురువారం అసెంబ్లీ క్వశన్ హవర్‌‌లో శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు సగటున నెలకు 52 కోట్లు చెల్లిస్తే, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలకు సగటున 89 కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు. 2023 డిసెంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ. 2400 కోట్లకు రూపాయలకుపైగా పేమెంట్స్ చేశామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లకుపైగా బకాయిలు ఉండగా, ఈహెచ్‌ఎస్‌ కింద మరో 130 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఈ పాత బకాయిలను కూడా తగ్గిస్తూ వస్తున్నామని మంత్రి వివరించారు.

రూ. 250 కోట్ల వరకూ మాత్రమే బకాయిలు

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లకు సుమారు 250 కోట్ల వరకూ మాత్రమే బకాయిలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటల్స్‌ అన్నింటికి రెగ్యులర్‌‌గా పేమెంట్స్‌ చేస్తామని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు ప్రైవేటు హాస్పిటళ్ల నిరాకరిస్తున్నాయని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. ఆరోగ్యశ్రీలో చేరేందుకు ప్రైవేటు హాస్పిటళ్లు ఆసక్తి చూపిస్తున్నాయని, తాము అధికారంలోకి వచ్చినప్పటికి 330 ప్రైవేటు హాస్పిటళ్లలో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందగా, ఇప్పుడు ఆ సంఖ్య 537కు చేరిందని మంత్రి వెల్లడించారు. ములుగు, నారాయణపేట వంటి మారుమూల జిల్లాల్లోని హాస్పిటళ్లలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందేవిధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యశ్రీ సేవల్లో పెరిగిన నాణ్యతను, రెగ్యులర్‌‌గా బకాయిలు విడుదల చేస్తున్నామన్న సత్యాన్ని ఎంప్యానల్‌మెంట్ కోసం పోటీపడుతున్న ప్రైవేటు హాస్పిటళ్ల సంఖ్య స్పష్టం చేస్తోందని మంత్రి వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి

వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి భ‌గ‌వంతుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలి లైసెన్సులు ఇచ్చే...

ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి

ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి బిల్లులు రాక ద‌వాఖాన‌లు మూత‌బ‌డే ప‌రిస్థితి మేజర్ సర్జరీలకు...

ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్సై

ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్సై .. రూ. 20 వేలు తీసుకుంటూ దొరికిపోయిన...

నేత‌న్న‌ను కాపాడండి

నేత‌న్న‌ను కాపాడండి రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయండి ‘బ్యాక్ బిల్లింగ్’...

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో ఇక విప్ల‌వ‌మే..! చిన్న స్థ‌ల‌మున్నా ఇక‌పై...

ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు గ్రూప్ సి పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల టెన్త్,...

ఆర్టీసీలో జాబ్ రేస్‌..

ఆర్టీసీలో జాబ్ రేస్‌.. 198 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభం 26,160 మంది అభ్యర్థుల...

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌ ట్రాఫిక్ చలాన్లపై ప్ర‌భుత్వం క‌ఠిన రూల్స్‌ ఫైన్ చెల్లించ‌కుంటే ఆర్సీ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img