జేఎన్ఎస్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్మీ, పోలీస్, రెవెన్యూ, క్రీడలు, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్ మెంట్ కల్నల్ సునీల్ యాదవ్ మాట్లాడుతూ.. అగ్నివీర్ నియామకాలకు సంబంధించిన ఆన్లైన్ పరీక్షలో సుమారు 9 వేల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వీరందరికీ హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 23 వరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా పోలీస్ బందోబస్తు, మెడికల్ టీములు, అగ్నిమాపక వాహనాలు, 108 అంబులె న్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, ఆర్మీ మేజర్ ప్రకాష్ రాయ్, ఆర్మీ అధికారులు గురుదయాల్ సింగ్, సుభాష్, వి.వి. నాయుడు, వినోద్ కుమార్ శర్మ, మనీష్ కుమార్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, డిఆర్డివో మేన శ్రీను, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, సిపిఓ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, స్పోర్ట్స్ అధికారి అశోక్ కుమార్, హనుమకొండ ఏసిపి నరసింహారావు, మేరా యువభారత్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
జేఎన్ఎస్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


