epaper
Monday, March 2, 2026
epaper

మేడారంలో మ‌రుగుదొడ్ల వ‌ద్ద అరిగోస‌..!

మేడారంలో మ‌రుగుదొడ్ల వ‌ద్ద అరిగోస‌..!
అక్క‌డ కూడా చేయి చాపుతున్న వైనం
ఉచిత మ‌రుగుదొడ్ల కాడ అన‌ధికారికంగా వ‌సూళ్లు
రూ.10నుంచి 20 వ‌ర‌కు ఇవ్వాల్సిందేనంట‌
దుర్గంధంతో అల్లాడిపోతున్న భ‌క్తులు

కాకతీయ, మేడారం బృందం : మేడారం మహా జాతరలో భక్తులు ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరలో ప్రభుత్వం వంద‌ల‌ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్వహణ భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం ఉచితంగా వినియోగించుకోవాలని ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్ల వద్ద కొందరు అనధికార వ్యక్తులు బహిరంగంగా వసూళ్లకు పాల్పడుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఒక్కసారి వినియోగించాలంటే రూ.10 నుంచి రూ.20 వరకు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వకపోతే లోపలికి అనుమతించకపోవడం, మాటల దురుసుతనం ప్రదర్శించడం జరుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మేడారంలోని ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాత్రూం దగ్గర డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న వ్య‌క్తి

దుర్గంధం–అపరిశుభ్రతతో అవస్థలు

జాతర సందర్భంగా దాదాపు 5,700 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, భక్తుల రద్దీకి తగినట్లుగా శుభ్రపరిచే చర్యలు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చాలాచోట్ల మరుగుదొడ్ల చుట్టూ దుర్వాసనతో భక్తులు నిలబడలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరుగుదొడ్లలో అవసరమైన నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. నీరు లేకపోవడంతో వినియోగం తర్వాత శుభ్రత పాటించడం కష్టంగా మారిందని భక్తులు చెబుతున్నారు. ఈ కారణంగా మరుగుదొడ్లలో అపరిశుభ్రత మరింత పెరుగుతోందని స్థానికులు అంటున్నారు.

సిబ్బంది ఉన్నా కనిపించని నిర్వహణ

జాతర నిర్వహణకు 5,000 నుంచి 9,000 మంది పారిశుధ్య సిబ్బందిని మోహరించామని, 526 మంది సూపర్‌వైజర్లతో 25 సెక్టార్లలో పర్యవేక్షణ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ జాతర లోపలి ప్రాంతాల్లో వ్యర్థాల తొలగింపు, మరుగుదొడ్ల శుభ్రత సకాలంలో జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కాగితాలకే పరిమితమైందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవిత్రమైన వనదేవతల జాతరకు వచ్చి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉచిత సౌకర్యాల పేరుతో అక్రమ వసూళ్లు అరికట్టాలని, మరుగుదొడ్ల నిర్వహణను తక్షణమే మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే జాతర స్థాయికి తగిన ఏర్పాట్లు లేవన్న విమర్శలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img