epaper
Monday, March 2, 2026
epaper

గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణపై ఆర్బిట్రేషన్

గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణపై ఆర్బిట్రేషన్
భూములు కోల్పోయిన రైతులతో కలెక్టర్ చర్చలు
పరిహారం, సాంకేతిక అంశాలపై సమీక్ష
సంగెం మండలానికి చెందిన 8 మంది రైతుల సమస్యల పరిష్కారం
నిబంధనల ప్రకారం రైతులకు న్యాయం చేస్తామని హామీ

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలను వేగవంతం చేసింది. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో సంగెం మండలానికి చెందిన రైతులతో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. హైవే నిర్మాణానికి సంబంధించిన భూసేకరణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిహారం చెల్లింపు, ఇతర సాంకేతిక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రైతులు తమ అభ్యంతరాలు, పరిహారం విషయంలో ఉన్న సందేహాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రైతులకు న్యాయం చేయడమే లక్ష్యం
ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ, సంగెం మండలానికి చెందిన 8 మంది రైతుల ఆర్బిట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. భూ సేకరణలో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన పరిహారం, ప్రయోజనాలను అందజేస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే 163జి నిర్మాణం రాష్ట్రానికి, జిల్లాకు కీలక ప్రాజెక్ట్ అని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే అభివృద్ధితో పాటు రైతుల ప్రయోజనాలను కూడా సమానంగా కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఆర్బిట్రేషన్ ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో వరంగల్ ఆర్డీవో సుమ, సంగెం తహసిల్దార్ రాజ్‌కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు విశ్వప్రసాద్‌తో పాటు సంబంధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు. భూసేకరణకు సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించి, రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img