పెద్దపల్లి ఐటీఐలో అప్రెంటిస్ మేళా
కాకతీయ, పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ (సీఓపీఏ) వంటి ట్రేడ్లు పూర్తి చేసిన అభ్యర్థులకు ఈనెల 9న (సోమవారం) ఉదయం 10.30 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ బీ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేళాలో హైదరాబాద్‌కు చెందిన ఐటీసీ లిమిటెడ్, ఎల్ అండ్ టీ, ష్నైడర్ ఎలక్ట్రిక్ తదితర బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ ఇండియా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని బయోడేటా, పదో తరగతి మెమో, ఐటీఐ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రెండు ఫోటోలు తదితర ధ్రువపత్రాలతో పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


