ఉపాధ్యాయ బోధనలకు ప్రశంసలు
నెల్లికుదురు టీజీఎంఎస్‌లో ప్యానల్ తనిఖీ
ఆధునిక బోధన, పరిపాలనపై పూర్తి సంతృప్తి
కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ (టీజీఎంఎస్), నెల్లికుదురులో సోమవారం ప్యానల్ ఇన్‌స్పెక్షన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా మోడల్ స్కూళ్ల సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ ఎం.డి. అఖ్తర్ ఉజ్జమాన్ నేతృత్వంలోని బృందం పాఠశాలను సందర్శించి బోధనా విధానాలను పరిశీలించింది. ప్యానల్ సభ్యులు తరగతుల్లో అమలవుతున్న బోధన పద్ధతులు, ఉపాధ్యాయుల నిబద్ధత, విద్యార్థుల అభ్యాస స్థాయిని సమగ్రంగా పరిశీలించి ప్రశంసలు తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు అవలంబిస్తున్న ఆధునిక బోధనా పద్ధతులు ప్రశంసనీయమని అభినందించారు. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు సమర్థవంతమైన పరిపాలన, విద్యా నిర్వహణ, క్రమశిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్యానల్ బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశాల మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు


