కాకతీయ, మహబూబాబాద్: గ్రామ పరిపాలన అధికారులుగా ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ లకు ,రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి లోకేష్ కుమార్ ఆదేశించారు . బుధవారం హైదరాబాద్ సీసీఎల్‌ఏ కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ కలెక్టరేట్ లోని విసి హాల్ నుండి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం అమలులో భాగంగా, జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరీక్ష నిర్వహించిందని తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన హైటెక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఉచిత రవాణా, భోజన సదుపాయాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్ లలో వారిని నిర్ణీత సమయానికి తరలించాలని సూచించారు.
జిల్లా కి సంబందించి 151 మంది గ్రామ పరిపాలనాధికారులుగా నియామక పత్రాలు తీసుకోనున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికాులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


