epaper
Tuesday, March 3, 2026
epaper

మైనార్టీ గురుకులాలకు దర‌ఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ గురుకులాలకు దర‌ఖాస్తుల ఆహ్వానం
2026–27 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఐదో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ప్రవేశాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక గురుకులాలు
నాణ్యమైన విద్యావకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
అవగాహన కోసం ఆడియో–వీడియో ప్రచారం ప్రారంభం

కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ శుక్రవారం ఐడీఓసి క్యాంప్ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను మైనార్టీ గురుకులాల్లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదవ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో బాలురు, బాలికలకు విడివిడిగా, బూర్గంపాడులో బాలికలకు, భద్రాచలంలో బాలురకు, అశ్వారావుపేటలో బాలికలకు, ఇల్లందులో బాలికలకు మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

మైనార్టీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా గురుకులాలను ఏర్పాటు చేసిందని, వీటిలో ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాలను ప్రతి అర్హుడైన విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు. మైనార్టీ గురుకులాలపై అవగాహన పెంచేందుకు విజిలెన్స్ అధికారి కే.సీతారాములు రూపొందించిన ఆడియో, వీడియో పాటలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కే.సంజీవరావు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా అడ్మిషన్ల సమాచారం విస్తృతంగా ప్రజలకు చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అభివృద్ధి అధికారి కే.సంజీవరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్‌ఎల్‌సీ ఎం.జే. అరుణకుమారి, విజిలెన్స్ అధికారులు కే.సీతారాములు, ఎం.ఏ.రవూఫ్, మైనార్టీ గురుకులాల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత గురుకులాల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అభివృద్ధికి మారుపేరు తుమ్మల

అభివృద్ధికి మారుపేరు తుమ్మల ప్రతిపక్షాలు తుమ్మల ప్రతిష్ఠపై బురదజల్లే ప్రయత్నం ప్రజలు కర్రుకాల్చి వాత...

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాహుల్...

విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా...

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ...

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు కలెక్టరేట్‌లో ప్రజల అర్జీల స్వీకరణ కాకతీయ,...

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి ఎస్పీ రోహిత్ రాజ్‌ కాకతీయ, కొత్తగూడెం రూరల్: హోళీ...

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు ముందస్తుగా రంగుల పండుగ వేడుకలు సహజ రంగులతో చిన్నారుల...

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు... ప్రజల్లో ఆందోళన రేడియేషన్ భయం... అనుమతులపై అనుమానాలు సాయినగర్‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img