యాంత్రీకరణ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండల రైతుల నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి తెలిపారు. ఈ పథకం కింద మండలానికి 10 రోటవేటర్లు, 1 గడ్డిచుట్టే యంత్రం (స్ట్రా బేలర్) సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని, ఆసక్తి గల రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. అర్హతగా కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, వ్యవసాయ అవసరాలకు జారీ చేసిన ట్రాక్టర్ ఆర్‌సి, రెండు ఫోటోలు జతచేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు.


