ఉమ్మడి గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
కాకతీయ, హనుమకొండ: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ప్రభుత్వ గురుకులాల్లో ఐదో తరగతి (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల మడికొండ ప్రిన్సిపల్ డి. ఉమామహేశ్వరి తెలిపారు. ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు జనవరి 21లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే 6వ నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్లకు కూడా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.


