కాకతీయ,మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ లో భాగంగా 2025-26 సంవత్సరానికి గాను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు సివిల్ సర్వీసెస్ (ప్రభుత్వ ఉద్యోగులు), ఉద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఓలేటి జ్యోతి బుధవారం ఒక ప్రకటనలో మీ డియాకు తెలిపారు.
ఈ టోర్నమెంట్ లో పాల్గొనదలచిన వారు, ఈ నెల 09, 10 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొని, ఎంపిక కావలసి ఉంటుందని తెలిపారు. పురుషులు, మహిళల కు అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, బాస్కెట్బాల్, షటిల్ బ్యాట్మెంటన్,, క్యారమ్, హాకీ, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, రెజ్లింగ్ గ్రీకో రోమన్, ఖో-ఖో, యోగ విభాగాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఆసక్తి గల అన్ని శాఖల సివిల్ సర్వీసెస్ (ప్రభుత్వ ఉద్యోగులు)ఉద్యోగులు ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 5 గంటల లోపు, జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా యువజన క్రీడా శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 9440630681 నంబర్ లో సంప్రదించచ్చని, ఆసక్తి గల సివిల్ సర్వీసెస్ ఉద్యగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


