‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’
సక్సెస్ మీట్‌లో మాస్ రాజా రవి తేజ కామెంట్స్
కాకతీయ, సినిమా : మాస్ రాజా రవి తేజ ప్రధాన పాత్రలో నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం ప్రస్తుతం థియేటర్లలో మంచి స్పందనతో ప్రదర్శితమవుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. సాలిడ్ రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ తాజాగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రవి తేజ మాట్లాడుతూ నిర్మాత *సుధాకర్ చెరుకూరి*ని అభినందించారు. “మా మొదటి సినిమా రామారావు ఆన్ డ్యూటీ ప్రేక్షకులను నిరాశపరిచింది. అది సీరియస్ సినిమా. కానీ ఈసారి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంతో వచ్చాం. పోటీలో ఉన్న ఇతర సినిమాలతో పాటు మా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తప్పకుండా లాంగ్ రన్ కంటిన్యూ చేస్తుందని ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు. సినిమా విజయంలో భాగస్వాములైన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హాలిడే సీజన్ తర్వాత కూడా ఈ చిత్రం ఎలా నిలబడుతుందన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. ఈ సినిమాలో సత్య, వెన్నెల కిశోర్, సునీల్, సుధాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, పాటలు–బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి మార్కులు పడుతున్నాయి.


