epaper
Thursday, January 15, 2026
epaper

అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణ.. అడ్డంగా బుక్కయినట్లేనా..?

కాకతీయ, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయనపై వచ్చిన పలు అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచే ఈ విచారణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. నెల రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అంబటి రాంబాబు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాలంలోనే ఈ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా భూ కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, అక్రమ వసూళ్లలో ఆయన పాత్ర ఉందని ఫిర్యాదులు వచ్చాయి. ఒక ఎకరా భూమిని రూ.10 లక్షలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రూ.30 లక్షలకు అమ్మారని, భూ కన్వర్షన్ కోసం ఎకరాకు రూ.5 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరిలోని ఒక వైసీపీ నేత నేతృత్వంలో ఈ లావాదేవీలు జరిగాయని సమాచారం. అంతేకాకుండా కొండమోడు ప్రాంతంలోని ముగ్గురాయి వ్యాపారుల నుంచి గత ఐదేళ్లలో సుమారు రూ.10 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులు చెబుతున్నాయి.

విద్యుత్ శాఖలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను ఒక్కొక్కదాన్ని రూ.7 లక్షల ధరకు అమ్ముకున్నారని ఫిర్యాదులు వెలువడ్డాయి. ఈ మొత్తం వ్యవహారం అంబటి రాంబాబు మంత్రిత్వ కాలానికి సంబంధించిందని ఆరోపణలు చెబుతున్నాయి.

ఇక వైసీపీ మాత్రం దీనిని రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు ప్రతీరోజూ జరుపుతున్న మీడియా సమావేశాల వల్ల అసహనం చెంది, ఆయనపై తప్పుడు ఆరోపణలు మోపుతోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, టీడీపీ, కూటమి నేతలు మాత్రం భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ హయాంలో అవినీతి చేసిన వారందరికీ విచారణ తప్పదు. ఫిర్యాదులు ఉన్నందువల్లే విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోందని వారు చెబుతున్నారు.

అంబటి రాంబాబు కూడా ఇప్పటికే ఆరోపణలపై స్పందించారు. తనపై మోపబడుతున్నవి అసత్య ఆరోపణలేనని, రాజకీయ కారణాల వల్లే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. అయినప్పటికీ, విచారణలో అక్రమాలు నిరూపితమైతే కేసు తీవ్రంగా ముదిరే అవకాశం ఉంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచారణ ఏ దిశగా సాగుతుందో, ఫలితం ఏమిటో అన్నదానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలంతా దృష్టి సారించాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని కాకతీయ,...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img