బీఆర్ఎస్, బీజేపీల్లో బీసీ వ్యతిరేక డీఎన్ఏ
ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

కాకతీయ, హైదరాబాద్ : బిఆర్ఎస్,బిజెపి పార్టీలకు బిసి వ్యతిరేక డిఎన్ఏ ఉందని,బిఆర్ఎస్,బీజేపీ పార్టీని తెలంగాణ సమాజం 100 అడుగుల లోతు గోతిలో పూడ్చిపెట్టబోతుందని ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు.బుదవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లకో మాట్లాడుతూ రామచందర్ రావు ఈవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అయిండో అర్థం కావట్లేదు దొడ్డి దారిలో అధ్యక్షుడు అయిన రామచందర్ రావు బిసిల ను కించపరితే విధంగా అడ్డ దిడ్డంగా మాట్లాడుతుండుతుంటే బిసి నాయకులు బండి సంజయ్, పాయల శంకర్ ,నిజమా బాద్, ఎంపీ అరవింద్,లక్ష్మణ్ ,ఈటెల రాజేందర్ ఎందుకు కామ్ గా ఉన్నారని ప్రశ్నించారు.బీసీలను కించపరిచిన రామచందర్ రావును బీజేపీ లోని బిసి నాయకులు గల్లా పట్టుకొని నిలదీయాలన్నారు. బీజేపీ బిసిల వ్యతిరేక పార్టీ అని అర్థం అయిపోయింది లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని బీసీలు బాయ్ కాట్ చేయబోతున్నారుబిసిల రిజర్వేషన్ల పై బిఆర్ఎస్,బీజేపీ నాయకులు వంకర టింకర గా మాట్లాడితే మిమ్ముల్ని బీసీలు తెలంగాణ లో తిరగనియ్యమని మెట్టు సాయికుమార్ హెచ్చరించారు.


