కాకతీయ , కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్నూల్ నుంచి ఆయిల్ ప్యాకెట్లతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిలిపి ఉంచగా, ఖమ్మం నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న మరో లారీ వెనుక నుండి ఢీకొని ఆగి ఉన్న లారీని హోటల్ వైపు దూసుకెళ్లించింది.
ఘటన సమయంలో రోడ్డు దాటుతున్న అరుణ అనే మహిళ స్వల్ప గాయాలు అయ్యాయి.అదృష్టవశాత్తూ,హోటల్ ఆ సమయంలో మూసి ఉంది,అందువల్ల పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
ప్రమాదానికి కారణమయ్యే కారకాలను గుర్తించేందుకు, స్థానికంగా సాక్ష్యాలను సేకరిస్తూ కేసు నమోదు చేశారు. స్థానికులు ఈ ఘటనతో భయాందోళన చెందారు. పోలీసులు రోడ్డు సురక్షితంగా ఉండేలా పర్యవేక్షణను పెంచారు.


