ప్రజా ప్రభుత్వం లో మహిళలకు మరో కానుక
అర్హులందరికీ ఇందిరా మహిళా చీరలు అందిస్తాం
నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి…..
కాకతీయ చెన్నారావుపేట: చెన్నారావుపేట మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పథకంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దింతి మాధవరెడ్డి హాజరై మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేయడం చాలా సంతోష కరం అని నియోజకవర్గంలోనే చీరలు పంపిణీ మొట్టమొదట చెన్నారావుపేట మండలంలో ఎంపిక చేసుకున్నామని అన్నారు.రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు.మహిళా సంఘాలలో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం అని అన్నారు.పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఇక ముందు చేస్తూనే ఉంటాము అని అన్నారు. 200 యూనిట్లకు ఉచిత విద్యుత్,ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు సౌకర్యం,ఆరోగ్య శ్రీ పథకం10 లక్షలకు పెంపు,నూతన రేషన్ కార్డులు మంజూరు పథకాల పై ప్రజలకు వివరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నామని పేదలకు అరుదైన గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అయింది అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


