epaper
Monday, March 2, 2026
epaper

ఇసుక దందాపై ఉక్కుపాదం

కాకతీయ ఎఫెక్ట్..
ఇసుక దందాపై ఉక్కుపాదం
అక్రమాలపై నేరుగా రంగంలోకి దిగిన కలెక్టర్, పోలీస్ కమిషనర్
ఇసుక క్వారీలు, చెక్‌పోస్టులపై ఆకస్మిక తనిఖీలు
క్వారీల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు
అక్ర‌మాలు తేలితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చ‌రిక‌లు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జిల్లాలో ఇసుక ర్యాంపులు, ఇసుక రవాణాలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఇసుక అక్రమాలపై కాకతీయ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమవడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్వయంగా రంగంలోకి దిగారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఇసుక రీచ్‌ల నిర్వహణ, రవాణా జరగాలంటూ కఠిన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి వీణవంక మండలం చల్లూరు గ్రామంలోని టీజీఎండీసీ ఇసుక క్వారీని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్వారీ వద్ద వేయింగ్ బ్రిడ్జ్ పనితీరును పరిశీలించి, ఇసుక లారీల లోడింగ్ బరువును స్వయంగా చెక్ చేశారు. వే బిల్లులు, డీడీలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి లారీకి లోడింగ్‌కు ముందు, తర్వాత తప్పనిసరిగా వేయిట్ చేయాలని, ఎంట్రీ–ఎగ్జిట్ వివరాలను సాండ్ ఆడిట్ యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

నిబంధనలు కచ్చితంగా పాటించాలి

ఇసుక లోడింగ్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని టీజీఎండీసీ సిబ్బందికి స్పష్టం చేశారు. రికార్డులు, వే బిల్లులు, డీడీల్లో ఏ చిన్న తేడా ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డీడీలు చెల్లించిన మేరకే లోడింగ్ జరగాలని, అక్రమాలకు పాల్పడితే వెంటనే కేసులు నమోదు చేస్తామని తేల్చిచెప్పారు. క్వారీ ప్రాంగణంలోని కీలక ప్రాంతాల్లో, లోడింగ్ పాయింట్లు, వేయింగ్ బ్రిడ్జ్, లారీ వివరాల నమోదు గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైన కంప్యూటర్లు, పరికరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు. లారీ డ్రైవర్లు తప్పనిసరిగా టార్పాలిన్ కవర్లు వినియోగించాలని, రోడ్డుపై ఇసుక పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

చెక్‌పోస్టులపైనా నజర్

వీణవంక మండలం మామిడాలపల్లి, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామాల్లోని ఇసుక చెక్‌పోస్టులను పరిశీలించి ప్రతి లారీకి సంబంధించిన వే బిల్లులు, డీడీలను జాగ్రత్తగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్వారీ సిబ్బంది, లారీ డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్పష్టం చేశారు. ఇసుక ర్యాంపులు, చెక్‌పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ తనిఖీల్లో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, హుజురాబాద్ ఏసీపీ మాధవి, వీణవంక–మానకొండూరు తహసీల్దార్లు అనుపమ, విజయ్, టీజీఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img