అంగన్వాడీ కేంద్రానికి సహాయకురాలిని నియమించాలి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డు పరిధిలో జగన్ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి సహాయకురాలిని నియమించాలని 25వ వార్డు కౌన్సిలర్ టీచర్ నర్ర సంధ్య శ్రావణ్ కోరారు. శనివారం 25 వ వార్డు పరిధి జగన్ కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని 25 వ వార్డు కౌన్సిలర్ సంధ్య శ్రావణ్ సందర్శించారు. అనంతరం అంగన్వాడి సెంటర్ లోని పిల్లల కలిసి నర్ర సంధ్యా శ్రావణ్ భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే టీచర్ తో పాటు సహాయకురాలు ఎంతో అవసరం అన్నారు. పిల్లలు, గర్భిణీ, బాలింతలు అంగన్వాడీ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. గత కొన్ని నీళ్లు గా 25వ వార్డులోని అంగన్వాడీ కేంద్రానికి సహాయకురాలు లేక పని భారం పడుతుందని అంగన్వాడీ టీచర్ సంధ్య వాపోతున్నట్లు చెప్పారు. అంగన్వాడి సెంటర్ కు వచ్చే పిల్లల ఆలనా పాలన చూసుకునేందుకు అంగన్వాడీ టీచర్ కు ఇబ్బందిగా మారుతుందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి జగన్ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి సహాయకురాలిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు నర్రా శ్రావణ్, అంగన్వాడి పిల్లల పేరెంట్స్ లావణ్య, స్వరూప, లత, రజియా సుల్తానా పాల్గొన్నారు.


